West Godavari District: ప్రభుత్వ అనుమతి రాక ఎస్వీఆర్‌ కాంస్య విగ్రహావిష్కరణ వాయిదా

  • తాడేపల్లిగూడెం కె.ఎన్‌.రోడ్డులో ఏర్పాటు
  • రేపు చిరంజీవి ఆవిష్కరిస్తారని ప్రకటించిన నిర్వాహకులు
  • కార్యక్రమం వాయిదాపడిందని తాజాగా వెల్లడి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించతలపెట్టిన ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. హీరో, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పౌరాణిక, సాంఘిక, కుటుంబ కథా చిత్రాల్లో తన సహజమైన హావభావాలతో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి, విశ్వనట చక్రవర్తిగా కీర్తి సొంతం చేసుకున్న ఆ మహానటుడిని గౌరవించాలన్న ఉద్దేశంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్‌ సర్కిల్‌, కె.ఎన్‌.రోడ్డులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహాన్ని రేపు మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం, ఇతరత్రా అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

West Godavari District
tadepalligudem
SVR statue
programme changed
  • Loading...

More Telugu News