Telangana: లండన్ లో ఖమ్మం బీజేపీ నేత కుమారుడి మిస్సింగ్!

  • సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు హర్ష అదృశ్యం
  • హాస్టల్ నుంచి బయటకెళ్లి తిరిగిరాని హర్ష
  • ఉదయ్ ప్రతాప్ కు ఫోన్ చేసిన ఎంపీ నామా

తెలంగాణ బీజేపీ నేత కుమారుడు లండన్ లో అదృశ్యమయ్యాడు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు హర్ష లండన్ లో పీజీ చదువుతున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. దీంతో హర్ష హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదయింది. ఈ విషయాన్ని హర్ష కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న హర్ష కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఫోన్‌లో ఉదయ్‌ప్రతాప్‌తో మాట్లాడారు. లండన్‌లోని దౌత్య అధికారులతో మాట్లాడి హర్ష ఆచూకీ కనుక్కునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖతో పాటు లండన్‌లో ఉన్న తెలుగువాళ్లతో తాను మాట్లాడతాననీ, ప్రత్యేకంగా కేంద్రానికి లెటర్ రాసి హర్ష ఆచూకీ తెలుసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని నామా భరోసా ఇచ్చారు.

Telangana
BJP
sanne uday pratap son
missing
Naama nageswara rao
TRS
London
Police
Missing
  • Loading...

More Telugu News