Acharya balkrishna: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బాబా రాందేవ్‌ సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణ

  • చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆచార్య బాలకృష్ణ
  • ఆసుపత్రిలో చేరినప్పుడు గుర్తించలేని స్థితిలో ఉన్నారన్న వైద్యులు
  • ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షలో బాలకృష్ణ

 ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు అత్యంత సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. చాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చారు. పతంజలి యోగ్ పీఠ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న ఆచార్య బాలకృష్ణను తొలుత హరిద్వార్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎయిమ్స్‌కు రెఫర్ చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు ఆయనను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్చారు.

ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన స్పృహలో లేరని ఆసుపత్రి సూపరింటెండెంట్ బ్రహ్మప్రకాశ్ తెలిపారు. కొన్ని పరీక్షలు చేశామని, అన్నీ సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నారు. న్యూరో ఫిజీషియన్, కార్డియాలజిస్ట్ ఆయనను పరీక్షించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో బాలకృష్ణ ఉన్నారని బ్రహ్మప్రకాశ్ వివరించారు.

Acharya balkrishna
baba ramdev
patanjali
aiims
  • Loading...

More Telugu News