trainee IPS: ఘనంగా ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

  • హాజరై గౌరవ వందనం స్వీకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
  • హైదరాబాద్‌లోని పోలీస్‌ అకాడమీలో 70వ బ్యాచ్‌కి శిక్షణ
  • శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 92 మంది అధికారులు

సివిల్‌ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని  సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 70వ బ్యాచ్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఐపీఎస్‌ల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ బ్యాచ్‌లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరి నుంచి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ఐపీఎస్‌ శిక్షణలో టాపర్ గా నిలిచిన గౌస్ అలంను తెలంగాణకు కేటాయించారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

trainee IPS
70 batch
passing out pared
amith sha
  • Loading...

More Telugu News