Janasena party: పవన్ కల్యాణ్ బ్లాక్ మనీ మార్చారంటూ దుష్ప్రచారం. .సైబర్ క్రైమ్ పోలీస్ కు ’జనసేన’ ఫిర్యాదు!

  • రూ.2 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ చేశారని దుష్ప్రచారం
  • వైసీపీ సోషల్ మీడియా విభాగంపై ఆరోపణలు 
  • బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ‘జనసేన’ డిమాండ్

సామాజిక మాధ్యమాల వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ‘జనసేన’పై జరుగుతున్న దుష్ప్రచారానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు.

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రూ.2 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా ఆయన మార్చారంటూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

Janasena party
Pawan Kalyan
YSRCP
Social Media
  • Loading...

More Telugu News