Andhra Pradesh: రాష్ట్రంలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు కానీ, మా ఇంటికి మాత్రం ఇచ్చారు: చంద్రబాబునాయుడు
- వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైపరీత్యమే
- నా ఇంటిని ముంచాలని చూశారు
- కృష్ణా నది పరీవాహక ప్రాంతాలన్నీ ముంచేశారు
కృష్ణా నదికి ఇటీవల సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ వైపరీత్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన ఇంటిని ముంచాలనే ఉద్దేశంతో కృష్ణా నది పరీవాహక ప్రాంతాలన్నీ ముంచేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం బ్యారేజ్ లో నీళ్లు నేరుగా తన ఇంటి వద్దకు రావాలనేది వైసీపీ నాయకుల ఆలోచన అని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు కానీ, తన ఇంటికి మాత్రం వచ్చి ఇచ్చారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తన నివాసంపైన డ్రోన్ ఎగురవేశారని, ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.