cm: అన్యమత ప్రచారం గురించి సీఎం జగన్ కు తెలుసా?: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదు
  •  తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలి
  • అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలి

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ టికెట్ వెనుక జెరూసలేంపై అన్యమత ప్రచారం చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదని, ఈ విషయం గురించి సీఎం జగన్ కు తెలుసా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, దేశంలో అందరి మనోభావాలను గౌరవించాలని సూచించారు.

cm
jagan
bjp
mla
rajasingh
kanna
  • Loading...

More Telugu News