Hyderabad: హైదరాబాద్‌లో దారుణ హత్య.. ఆటో డ్రైవర్‌ను నరికి చంపిన దుండగులు

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • హత్య చేసిన అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన దుండగులు
  • బొల్లారం చౌరస్తాలో తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్‌ శివారు మియాపూర్‌లో ఈ తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. మియాపూర్ ధర్మపురి క్షేత్రం వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ (24)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. అక్కడితో ఆగని దుండగులు ప్రవీణ్ తలను మొండెం నుంచి వేరుచేసి తీసుకెళ్లారు. దానిని బొల్లారం చౌరస్తాలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తల, మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.


Hyderabad
murder
auto driver
miyapur
  • Loading...

More Telugu News