UAE: నా భర్త నాతో గొడవ పడడం లేదు.. విడాకులు ఇప్పించండి: కోర్టుకెక్కిన మహిళ

  • పెళ్లైన ఏడాదిలో ఒక్కసారి కూడా గొడవ పడలేదన్న భార్య
  • అతడి మంచితనం తనకు నరకంలా ఉందన్న వైనం
  • ఆమెతో గొడవ పడలేనన్న భర్త

మీరు చదివింది కరెక్టే! తన భర్త మంచితనాన్ని తట్టుకోలేని భార్య విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. తానెన్నన్నా ఒక్క మాటా మాట్లాడడం లేదని, తనతో వాదనకు దిగడం లేదని, అతడి ప్రేమను తట్టుకోవడం తన వల్ల కాదంటూ ఆమె చెబుతున్న మాటలు చూసి న్యాయస్థానమే ఆశ్చర్యపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షరియత్‌ కోర్టులో జరిగిందీ ఘటన.

షార్జాకు చెందిన జంటకి ఏడాది క్రితం వివాహమైంది. తాజాగా ఆమె విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు భర్తతో ఎటువంటి గొడవలు లేవని, అతడి ప్రేమ, మంచితనాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొంది. పెళ్లైన తర్వాత ఒక్క రోజు కూడా తమ మధ్య గొడవ జరగలేదని తెలిపింది. ఆయనతో గొడవ పడకుండా అతడి ప్రేమను భరిస్తూ ఉండడం నరకంలా ఉందని, ఎలాగైనా తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఆమె పిటిషన్ చూసిన కోర్టు తెల్లబోయింది.

ఆమె విడాకుల పిటిషన్‌పై కోర్టు భర్తను ప్రశ్నించింది. భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెతో తాను గొడవపడలేనని తేల్చి చెప్పాడు. ఒకసారి ఆమె తాను బరువు తగ్గాలని చెప్పిందని, దీంతో కఠినమైన డైట్‌తో తగ్గానని వివరించాడు. ఆమెతో గొడవ పడడం తన వల్ల కాదని స్పష్టం చేశాడు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటూ తీర్పును వాయిదా వేశారు. ఏడాది వ్యవధిలోనే భార్యాభర్తల సంబంధాలపై ఓ అవగాహనకు రాలేమని కోర్టు స్పష్టం చేసింది.

UAE
husaband
wife
divorce
  • Loading...

More Telugu News