Prabhas: 'ఎవరో ఒకర్ని చూసుకుని త్వరగా పెళ్లి చేసుకో' అంటూ అనుష్కకు సలహా ఇస్తా: ప్రభాస్

  • 'సాహో' ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ బిజీ
  • అనుష్కతో రిలేషన్ షిప్ గురించి మీడియా ప్రశ్న
  • అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభాస్

టాలీవుడ్ లో అగ్రనటులుగా పేరుపొందిన ప్రభాస్, అనుష్కల సాన్నిహిత్యం గురించి ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై ప్రభాస్ మరోసారి స్పష్టతనిచ్చారు. 'సాహో' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్ దీని గురించి మాట్లాడుతూ, తామిద్దరం రిలేషన్ లో ఉంటే ఆ విషయం దాచాల్సిన అవసరం లేదని, ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పేది నమ్మకపోతే ఇంకేం చేయలేనని అన్నారు. ఈ ప్రచారం ఇంతటితో ఆగిపోవాలంటే అనుష్క అయినా పెళ్లి చేసుకోవాలి, లేదా తానైనా ఓ ఇంటివాడ్ని కావాలని ప్రభాస్ అభిప్రాయపడ్డారు. ఎవరో ఒకర్ని చూసుకుని త్వరగా పెళ్లి చేసుకో అంటూ అనుష్కకు సలహా ఇస్తానని చెప్పారు.

Prabhas
Anushka Shetty
Saaho
  • Loading...

More Telugu News