Andhra Pradesh: ఏపీలో వరద ముంపుపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి!: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

  • వరదపై రాష్ట్రాన్ని సీడబ్ల్యూసీ హెచ్చరించింది
  • అయినా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడలేదు
  • రాజధానిపై జగన్ క్లారిటీ ఇవ్వాలి
  • మీడియాతో గుంటూరు టీడీపీ చీఫ్ ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ లో వరద ముంపుపై కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ముందుగానే హెచ్చరించిందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. అయినా ఏపీ ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనీ, దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆంజనేయులు మండిపడ్డారు. అలాగే ఆంధ్రుల రాజధాని అమరావతి విషయంలోనూ ప్రభుత్వం గందరగోళం రేకెత్తించేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Guntur District
Telugudesam
Flood
YSRCP
Gv anjaneyulu
  • Loading...

More Telugu News