jp nadda: కేటీఆర్-జేపీ నడ్డా.. మధ్యలో 'ఉప్పల్ బాలు'!

  • నడ్డా ఎవరో తెలియదన్న కేటీఆర్
  • టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • ఉప్పల్ బాలు క్రేజ్ పెంచుతున్న ఇరు పార్టీల అభిమానులు

జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైన వేళ.. మధ్యలో టిక్‌టాక్ స్టార్ ఉప్పల్ బాలు ఎంట్రీ ఇవ్వడంతో వివాదం కాస్తా రసవత్తరంగా మారింది. ఈ నెల 18న నాంపల్లిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ తీవ్ర విమర్శలు చేశారు.

నడ్డా వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. నడ్డా నాటకాలు ఇక్కడ పనిచేయవని, అసలు నడ్డా ఎవరో తనకు తెలియదని అన్నారు. దీంతో టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. గతంలో నడ్డాను కలిసిన కేటీఆర్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నడ్డా ఎవరో తెలియదన్న కేటీఆర్ వీటిని చూసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలకు కౌంటర్‌గా టీఆర్ఎస్ అభిమానులు ఉప్పల్ బాలును రంగంలోకి దింపారు.  
 
నడ్డా-ఉప్పల్ బాలు ఫొటోలను షేర్ చేస్తూ వీరిలో మీకు ఎవరు బాగా తెలుసో చెప్పాలంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు. ఇది చూసిన బీజేపీ అభిమానులు కేటీఆర్-ఉప్పల్ బాలు ఫొటోలను పెట్టి వీరిలో మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరో చెప్పాలంటూ సోషల్ మీడియాలో యుద్ధానికి తెరలేపారు. టీఆర్ఎస్-బీజేపీ యుద్ధం సంగతేమో కానీ.. మధ్యలో ఉప్పల్ బాలుకు మాత్రం విపరీతమైన ప్రచారం లభిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News