Railway: ఇకపై రైళ్లలో ‘ప్లాస్టిక్’ వినియోగంపై నిషేధం

  • 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం
  • అక్టోబర్ 2 నుంచి అమల్లోకి
  • ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు

ఇకపై రైళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి తెరపడనుంది. రైళ్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ మెటీరియల్ వాడకాన్ని నిషేధించనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి దీనిని అమలు చేయాలని రైల్వే శాఖ తన విభాగాలను ఆదేశించింది. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ రోజున పీఎం ప్రధాని పిలుపు మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News