Andhra Pradesh: కోడెల దొంగతనానికి పాల్పడ్డాడు.. 5 కోట్ల మంది పరువు తీశాడు!: విజయసాయిరెడ్డి ఆగ్రహం
- ఏపీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం
- తన ఇంట్లోనే ఉందన్న కోడెల
- కోడెలపై దొంగతనం కేసు పెట్టాలన్న వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తరలిస్తున్న ఫర్నీచర్ కొంత మాయం కావడంపై ఇటీవల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఫర్నీచర్ తన దగ్గరే ఉందని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోడెల వ్యవహారశైలిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి కోడెల శివప్రసాద్ ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ను ఎత్తుకెళ్లారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
అలాంటి వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల దొంగతనానికి పాల్పడటం ద్వారా 5 కోట్ల మంది పరువు తీశాడని దుయ్యబట్టారు. కోడెల, ఆయన దూడలను టీడీపీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఇప్పటికైనా చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.