Lookout Notice: చిదంబరానికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీచేసిన ఈడీ!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దక్కని ముందస్తు బెయిల్
  • అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
  • దేశం విడిచిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీసుల జారీ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో చిదంబరం దేశం విడిచిపారిపోకుండా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు లుకౌట్ నోటీసులు జారీచేశారు.

ఈ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించి చిదంబరంపై అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసులు నమోదయ్యాయి.

2007లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.

Lookout Notice
P Chidambaram
Facing Arrest
ED
New Delhi
Congress
INX MEDIA CASE
CBI
Police
ANTICIPATARY BAIL
  • Loading...

More Telugu News