Road Accident: హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాద ఘటన... అంతా మిస్టరీయే!

  • నిన్న తెల్లవారుజామున ప్రమాదం
  • ప్రమాదం తరువాత సీసీటీవీ దృశ్యాల్లో రాజ్ తరుణ్ ను పోలిన వ్యక్తి
  • ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్న పోలీసులు

ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని అల్కాపురి కాలనీ వద్ద నిన్న తెల్లవారుజామున నటుడు రాజ్ తరుణ్ కారుకు జరిగిన ప్రమాదం మిస్టరీగా మారింది. వేగంగా వస్తున్న వోల్వో కారు, అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురైందని, ఆపై కారులో ఉన్న రాజ్ తరుణ్ మరో వాహనాన్ని తెప్పించుకుని వెళ్లిపోయాడని స్థానికులు అంటుండగా, ఈ విషయంలో ఇప్పటివరకూ రాజ్ తరుణ్ స్పందించలేదు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే, రాజ్ తరుణ్ లా కనిపిస్తున్న వ్యక్తి దృశ్యాలు నమోదయ్యాయి.

ఇక ఇదే విషయమై పోలీసులు స్పందిస్తూ, టీఎస్‌ 09 ఈఎక్స్‌ 1100 నంబర్ గల కారు ప్రమాదానికి గురైన మాట వాస్తవమేనని, కారులో ఉన్నది ఎవరన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లభించలేదని అంటున్నారు. కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిందని, ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. కారు నంబర్‌ ఆధారంగా చిరునామా ట్రేస్ చేసి, స్కేజోన్‌ యజమానికి సమాచారం అందించామని పోలీసులు వెల్లడించారు. సదరు కారు యజమాని అనుచరుడు తమను సంప్రదించాడని, ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని అన్నారు. దీంతో కేసు మిస్టరీగా మారింది.

Road Accident
Raj Trarun
Police
Narsingi
  • Loading...

More Telugu News