Karnataka: ప్రమాణస్వీకారంలో నోరు జారిన కర్ణాటక కొత్త మంత్రి.. నవ్వుకున్న ముఖ్యమంత్రి!

  • 25 రోజుల తర్వాత కేబినెట్‌ను విస్తరించిన యడియూరప్ప
  • మధుస్వామి తీరుతో నవ్వులు
  • 17 మందికి కేబినెట్‌లో స్థానం కల్పించిన సీఎం

గత నెల 26న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప నిన్న తన కేబినెట్‌ను విస్తరించారు. ఈ సందర్భంగా 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మధుస్వామి ప్రమాణ స్వీకారం చేస్తూ నోరు జారారు. మంత్రికి బదులుగా ‘ముఖ్యమంత్రి’ అని పలకడంతో అందరూ అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం నవ్వుతూ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. మంత్రికి బదులు ముఖ్యమంత్రి అని పలకడంతో తొలుత ఆశ్చర్యపోయిన ఇతర నేతలు ఆ తర్వాత నవ్వేశారు.

పలు నాటకీయ పరిణామాల మధ్య యడియూరప్ప  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి నిన్నటి వరకు అంటే దాదాపు 25 రోజులు ఆయన ఒక్కరితోనే ప్రభుత్వం నడిచింది. కాగా, మధుస్వామి పొరపాటున ముఖ్యమంత్రిగా పలికిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న నెటిజన్లు.. ఈ ఏడాది మూడో ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Karnataka
yediyurappa
madhu swamy
minister
  • Error fetching data: Network response was not ok

More Telugu News