Andhra Pradesh: బొత్స వ్యాఖ్యలు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్నట్టు ఉన్నాయి: వర్ల రామయ్య

  • బొత్స ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు
  • అవగాహన లేకుండా మాట్లాడారేమో!
  • పనికిమాలిన నాయకుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

ఏపీ రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ, బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదని అన్నారు.

బొత్స వ్యాఖ్యలు మాత్రం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్నట్టుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అవగాహన లేకుండా, ఎటువంటి పర్యవసానాలు ఉంటాయో తెలియకుండా ఆయన మాట్లాడారో లేక ఆకతాయిగా మాట్లాడారో అని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని ప్రజలందరికీ, ప్రపంచానికి తెలిసిన తర్వాత అవగాహనలేని వాళ్లు, పనికిమాలిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు. ‘కనకపు సింహాసనంపై శునకంను కూర్చోబెట్టిన..’ అన్నది బొత్సకు బాగా వర్తిస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
capital
Amaravathi
Varla Ramaiah
  • Loading...

More Telugu News