Guntur District: విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ సంస్థలు సర్కారుతో ఒప్పందం చేసుకోవాలి: మంత్రి కన్నబాబు
- విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయం ప్రారంభం
- నాణ్యమైన విత్తనాల పంపిణీకి ఇది ఉపయోగపడుతుంది
- ప్రభుత్వ నియమావళికి లోబడి విక్రయాలు జరపాలి
విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ విక్రయించే సంస్థలు సర్కారుతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ మంత్రి కన్నబాబు ఆదేశించారు. గుంటూరు, లాం ఫాం లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా ఈ సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ నియమావళికి లోబడి ఆయా సంస్థలు విక్రయాలు జరపాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాల పంపిణీకి విత్తన ధ్రువీకరణ సంస్థ ఉపయోగపడుతుందని, నియోజకవర్గాల స్థాయిలోనూ ల్యాబ్ ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని చెప్పారు.