: సివిల్స్ ఫలితాలు బహిరంగ వెల్లడి


తొలిసారిగా యూపీఎస్సీ అభ్యర్థుల మార్కులను బహిరంగంగా వెల్లడించింది. మార్కులను నేరుగా అభ్యర్థులకు పంపించే విధానం అందుబాటులో ఉంది. కానీ, కొందరు కేంద్ర సమాచార కమిషన్ కు వెళ్లి ఇలా బహిరంగంగా ప్రకటించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో యూపీఎస్ సీ సివిల్స్ 2012 మెయిన్స్ ఫలితాలను తన వెబ్ సైట్ లో ఉంచింది.

టాప్ ర్యాంకర్ హరిత వి కుమార్ సాధించిన మార్కులు కేవలం 53 శాతమే. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో ఈ మాత్రం సాధించడమే చాలా కష్టం. 2250 మార్కులకు గాను హరిత 1193 మార్కులను సాధించింది. మొత్తం 980 మంది అభ్యర్థులను సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా, వీరిలో నలుగురు మాత్రమే 50 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నారు. 48 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్న జనరల్ అభ్యర్థులకు మొదటి మూడు సర్వీసులలో అవకాశం లభించింది.

  • Loading...

More Telugu News