Uttar Pradesh: ‘రాయ్ బరేలి రాబిన్ హుడ్’ అఖిలేశ్ సింగ్ కన్నుమూత!

  • కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్న అఖిలేశ్ సింగ్
  • లాలూపూర్ లో అంత్యక్రియలు
  • రాజకీయ ప్రముఖుల సంతాపం

ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ‘రాయ్ బరేలి రాబిన్ హుడ్’గా పేరు పొందిన అఖిలేశ్ సింగ్ మృతి చెందారు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న అఖిలేశ్ సింగ్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. రాయ్ బరేలిలోని అఖిలేశ్ సింగ్ స్వగ్రామం లాలూపూర్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అఖిలేశ్ సింగ్ మృతిపై రాజకీయ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.

కాగా, నియోజకవర్గ ప్రజలు ఆయన్ని ‘రాయ్ బరేలి రాబిన్ హుడ్’గా పిలుచుకుంటారు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కూడా రాయ్ బరేలి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అఖిలేశ్ సింగ్ కుమార్తె అదితి సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Uttar Pradesh
Raibareli
Ex-mla
Akhilesh singh
  • Loading...

More Telugu News