Sherlyn Chopra: అడల్ట్ సినిమాను ఆఫర్ చేసిన రామ్ గోపాల్ వర్మపై మండిపడ్డ షెర్లిన్ చోప్రా

  • ఒక అవకాశం ఇవ్వాలంటూ వర్మకు నా ఫొటో పంపించా
  • మొత్తం బెడ్ సీన్లే ఉన్న స్క్రిప్ట్ పంపించాడు
  • సన్నీలియోన్ మాదిరి గొప్ప స్టార్ అవుతావని చెప్పాడు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక అడల్ట్ సినిమాను కొన్నేళ్ల క్రితం వర్మ తనకు ఆఫర్ చేశాడని తెలిపింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, 2016లో సినిమాలో ఒక అవకాశం ఇవ్వాలంటూ వర్మకు తన ఫొటోను పంపించానని చెప్పింది. ఆ తర్వాత వర్మ తనకు ఒక స్క్రిప్ట్ పంపించారని... అందులో మొత్తం బెడ్ సీన్లే ఉన్నాయని తెలిపింది. అసభ్యకరమైన సన్నివేశాలపై వర్మను తాను ప్రశ్నించానని... అప్పుడు వర్మ సన్నీ లియోన్ ను ఉదహరించాడని... అడల్ట్ సినిమాల్లో నటిస్తే సన్నీ లియోన్ మాదిరి గొప్ప స్టార్ అవుతావని చెప్పాడని మండిపడింది.

ఆ సందర్భంగా వర్మకు తాను ఘాటుగా సమాధానమిచ్చానని... బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారానే సన్నీలియోన్ స్టార్ అయిందని... అడల్ట్ సినిమాల్లో నటించడం ద్వారా కాదని చెప్పానని షెర్లిన్ తెలిపింది. సినీరంగంలోని కొందరు నిర్మాతలు కూడా తనపై చెడు వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ప్రస్తుతం తనకు ఎవరి సహాయ, సహకారాలు అవసరం లేదని... తనకే ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ఉందని తెలిపింది. పబ్లిసిటీ కోసం తాను ప్రస్తుతం ఈ విషయాలను వెల్లడించడం లేదని చెప్పింది.

Sherlyn Chopra
Ram Gopal Varma
RGV
Adult Movie
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News