Andhra Pradesh: ఏపీలో ఉగ్రరూపం దాల్చనున్న గోదారమ్మ.. హెచ్చరించిన ఆర్టీజీఎస్!

  • రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
  • శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి ప్రాంతాల్లో కుండపోత
  • భారీగా వరద రావొచ్చన్న ఆర్టీజీఎస్

గోదావరి నదికి మరోసారి భారీ వరద పోటెత్తే అవకాశముందని ఏపీకి చెందిన ఆర్టీజీఎస్ హెచ్చరించింది. నేటి నుంచి రాబోయే 3 రోజులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుందని చెప్పింది.

ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే వరద తాకిడితో అల్లాడుతున్న గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు తాజా వర్షాలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొనే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh
Heavy floods
Heavy rains
RTGS
Warning
Godavari river
  • Loading...

More Telugu News