Raavi Kondala Rao: మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు: నటుడు రావి కొండలరావు

  • రాధాకుమారి మంచి నటి 
  • నాటకాల ద్వారానే మా పరిచయం జరిగింది
  • అప్పట్లో నా నెల జీతం నూటా యాభై మాత్రమే   

నటుడిగా .. సినీ రచయితగా రావి కొండలరావు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన పెళ్లి విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నేను నాటకాలు బాగా రాసేవాడిని .. వేషాలు వేసేవాడిని. ఆ సమయంలోనే నాకు రాధాకుమారితో పరిచయం ఏర్పడింది.

అప్పట్లో ఆమె జేవీ సోమయాజులు .. రమణమూర్తి ట్రూప్ లో నాటకాలు వేసేది. రాధాకుమారికి సినిమాలంటే ఇష్టం .. అందువల్లనే ఆమెను చెన్నైకి పిలిపించి వేషాలు ఇప్పించాను. అప్పట్లో నాటకాల్లో స్త్రీ పాత్రల్లో నటించడానికి స్త్రీలు దొరకడం కష్టమయ్యేది. అందువలన నేను స్త్రీ పాత్రలు లేకుండా చూసుకునేవాడిని. రాధాకుమారి నటి కనుక, ఆమెని పెళ్లి చేసుకుంటే మంచి నాటకాలు రాయవచ్చని భావించి పెళ్లి చేసుకున్నాను. అప్పట్లో నా జీతం నెలకి నూటా యాభై మాత్రమే. అందువలన వాళ్లింట్లో మా పెళ్లికి ఒప్పుకోలేదు. 'ఈ నాటకాల పిల్ల మనకెందుకురా' అని చెప్పేసి మా ఇంట్లో వాళ్లూ అంగీకరించలేదు. అయినా పెళ్లి చేసేసుకున్నాము" అని చెప్పుకొచ్చారు.

Raavi Kondala Rao
Radha Kumari
  • Loading...

More Telugu News