Karnataka: కర్ణాటకలో కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 17 మంది.. గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు కూడా!

  • మంత్రివర్గ విస్తరణను చేపట్టిన కర్ణాటక బీజేపీ ప్రభుత్వం
  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ వాజూభాయ్ వాలా
  • కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన బి.శ్రీరాములు

కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ సహా 17 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.

Karnataka
Cabinet
Oath
B Sriramulu
BJP
  • Loading...

More Telugu News