polavaram project: ‘పోలవరం’ తాజా పరిణామాలపై కేంద్రం ఆరా!

  • టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలి
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి
  • పీపీఏ సీఈఓకు మంత్రి గజేంద్ర షెకావత్ ఆదేశం

ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన తాజా పరిణామాలపై కేంద్రం ఆరా తీసింది. యథాతథ స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని కోరింది. ఈ నిర్మాణం విషయంలో ఏం జరుగుతోందో కేంద్రానికి నివేదించాలని పీపీఏను ఆదేశించింది.

 టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని పీపీఏ సీఈఓ ఆర్కే జైన్ ను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆదేశించారు. కాగా, రివర్స్ టెండరింగ్ వద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ ద్వారా సూచించింది. ఈ లేఖ రాసిన వెంటనే ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

polavaram project
Reverse Tendering
shekavat
  • Loading...

More Telugu News