Aishwarya Rajesh: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్

  • క్రికెట్ నేపథ్యంలో సాగే 'కౌసల్య కృష్ణమూర్తి'
  • ప్రధాన పాత్రధారిగా ఐశ్వర్య రాజేశ్ 
  • ఈ నెల 23వ తేదీన విడుదల

ఇటీవల క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అదే క్రికెట్ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమానే 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాను రూపొందించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. కౌసల్య అనే అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదిరించి క్రికెటర్ గా ఎదిగిందనేది ఈ ట్రైలర్లో చూపించారు. 'నీ వల్ల కాదూ అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లను కాదు .. నిన్ను' .. 'ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు .. గెలిచిన వాళ్ల మాట వింటుంది .. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు' అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి.

Aishwarya Rajesh
Rajendra Prasad
  • Error fetching data: Network response was not ok

More Telugu News