Raj Nath Singh: పాకిస్థాన్ తో చర్చలకు సిద్ధం... కానీ, కేవలం పీవోకే పైనే సుమా!: రాజ్ నాథ్ సింగ్

  • జమ్మూకశ్మీర్ పై చర్చలు ఉండవు
  • ఉగ్రవాదానికి సహకారాన్ని ఆపేస్తేనే చర్చలు ఉంటాయి
  • భారత్ తప్పు చేసిందని పాక్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది

పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన వైఖరితో ముందుకు సాగుతోంది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పాకిస్థాన్ తో భారత్ చర్చలకు సిద్ధమని రాజ్ నాథ్ అన్నారు. అయితే, జమ్మూకశ్మీర్ అంశంపై ఈ చర్చలు ఉండవని... కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే చర్చలు ఉంటాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఓ పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ సహకారాన్ని ఆపేస్తేనే ఈ చర్చలు కూడా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ తప్పు చేసిందని తప్పుడుగా ఆరోపిస్తూ అంతర్జాతీయ సమాజం తలుపులను పాకిస్థాన్ కొడుతోందని ఆయన విమర్శించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News