Arun Jaitly: అరుణ్ జైట్లీ ఆరోగ్యం... నిన్నటి నుంచి మరింత విషమం!

  • 10 రోజుల క్రితం ఎయిమ్స్ లో చేరిక
  • నిన్న ఆసుపత్రికి వచ్చిన పలువురు
  • ఆరోగ్యంపై వాకబు

శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీలు పనిచేయని స్థితిలో 10 రోజుల క్రితం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి, నిన్న మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా మారినట్టు వైద్య ఆరోగ్య వర్గాలు ధ్రువీకరించాయి. ఈ విషయం తెలుసుకున్న తరువాతనే అమిత్ షా తదితరులు స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జైట్లీకి ఎయిమ్స్ కార్డియో అత్యవసర విభాగంలో ఐదుగురు వైద్యుల బృందం చికిత్సను అందిస్తోంది. నిన్న సాయంత్రం పలువురు బీజేపీ నేతలు హాస్పిటల్ కు వచ్చి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.

Arun Jaitly
AIIMS
New Delhi
Amit Shah
  • Loading...

More Telugu News