TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

  • కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
  • వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదం అందించిన పండితులు
  • ఆర్థిక మంత్రి వెంట వైసీపీ నేత విజయసాయిరెడ్డి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి స్వాగతం పలికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

స్వామివారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర మంత్రి సీతారామన్ కు వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్ర మంత్రి వెంట వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు.

TTD
Andhra Pradesh
Tirupati
Tirumala
nirmala sitaraman
YSRCP
Vijay Sai Reddy
BJP
  • Loading...

More Telugu News