Prabhas: వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రభాస్ కామెంట్... వైరల్ అవుతున్న వీడియో!

  • ప్రస్తుతం 'సాహో' ప్రమోషన్ లో బిజీగా ప్రభాస్
  • తమిళ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
  • జగన్ పాలన సంతృప్తికరమన్న ప్రభాస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ పై యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు కురిపించగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను నటించిన 'సాహో' ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా, ఓ తమిళ చానల్ షోలో పాల్గొన్న ప్రభాస్ కు, జగన్ పాలన ఎలా వుందన్న ప్రశ్న ఎదురైంది. రాష్ట్రంలో జగన్ ను బాహుబలిగా అభివర్ణిస్తున్నారని చెబుతూ, ఆయన పాలనపై మీరు ఏమనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ, తనకు రాజకీయాలపై పెద్దగా అవ‌గాహ‌న లేదని, అయితే, ఓ యువనేతగా జ‌గ‌న్ ఏపీని అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తార‌నే న‌మ్మకం తనకుందని అన్నారు. జ‌గ‌న్ ప‌నితీరు బాగుందని చెప్పారు. జగన్‌ పై ప్ర‌భాస్ చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

Prabhas
Jagan
Andhra Pradesh
Sahoo
  • Error fetching data: Network response was not ok

More Telugu News