Vijayasanthi: కేసీఆర్ సర్కారు బరితెగించింది: విజయశాంతి

  • మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపారన్న విజయశాంతి
  • ఎన్నికల్లో టీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న కాంగ్రెస్ నేత
  • కేసీఆర్ సర్కారు అధికార దుర్వినియోగానికి సిద్ధమవుతోందని ఆరోపణ

కాంగ్రెస్ నేత విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సర్కారు అడ్డదారులకు తెరలేపిందని ఆరోపించారు. హైకోర్టు తాజా వ్యాఖ్యలు వింటుంటే కేసీఆర్ సర్కారు బరితెగించిందన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. వార్డుల విభజనను కంటితుడుపు చర్యగా హైకోర్టు పేర్కొందన్న విజయశాంతి, హైకోర్టు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, టీఆర్ఎస్ సర్కారు అక్రమాలు బయటపడడం ఖాయమని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభావం టీఆర్ఎస్ పై తప్పక ఉంటుందని తెలిపారు. గెలిచేందుకు అడ్డదారులను ఆశ్రయించే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవకతవకలకు సిద్ధమవుతోందని విజయశాంతి మండిపడ్డారు.

Vijayasanthi
KCR
TRS
Telangana
  • Loading...

More Telugu News