Rajnath Singh: రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: పాకిస్థాన్

  • తొలుత అణ్యాయుధాలను ప్రయోగించకూడదనే నిర్ణయం మారొచ్చన్న రాజ్ నాథ్
  • రాజ్ నాథ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయన్న పాకిస్థాన్
  • పాక్ ఎంతో నిగ్రహంతో వ్యహరిస్తోందని వ్యాఖ్య

తొలుత అణ్వాయుధాలను ప్రయోగించకూడదనేని భారత్ సిద్ధాంతమని... అయితే, పరిస్థితులను బట్టి తమ నిర్ణయం మారుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. రాజ్ నాథ్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని... దురదృష్టకరమైనవని పాక్ విదేశాంగశాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. అణ్వాయుధాల ప్రయోగం విషయంలో పాకిస్థాన్ ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తోందని... ఇకపై కూడా అలాగే ఉంటుందని చెప్పారు.

Rajnath Singh
Pakistan
Nuclear Weapons
  • Loading...

More Telugu News