Telangana: టీడీపీకి తెలంగాణ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ గుడ్‌బై?

  • ఈ ఏడాది జూన్‌తో ముగిసిన దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యత్వం
  • ఆ వెంటనే ఆయనను సంప్రదించిన బీజేపీ నేతలు
  • పార్టీ మారడం లేదన్న తనయుడు వీరేందర్ గౌడ్

తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి టి. దేవేందర్‌గౌడ్ త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆయతోపాటు తనయుడు వీరేందర్ గౌడ్ కూడా కమలం తీర్థం పుచ్చకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

 దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. ఆ వెంటనే ఆయనను బీజేపీ నేతలు సంప్రదించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, పార్టీలో చేరిక విషయంలో కొంత ఆలోచనలో పడ్డారని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని అడిగినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై వీరేందర్ గౌడ్ స్పందించారు. తమకు ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. 

Telangana
Telugudesam
Devendar goud
BJP
  • Loading...

More Telugu News