abhinandan vardhaman: వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ధైర్యసాహసాలు కళ్లారాచూశా: స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌

  • పాకిస్థాన్‌ ఎఫ్‌-16ని కూల్చివేయడం స్క్రీన్‌పై గమనించాను
  • ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితి తెలియజేస్తున్నా
  • దెబ్బతీయాలనే పాక్‌ విమానం భారత్‌ భూభాగంలోకి వచ్చింది

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వీరోచిత పోరాటాన్ని, పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘటనను తాను కళ్లారా చూశానని స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ తెలిపారు. ఆ సమయంలో నేను అభినందన్‌కు వాతావరణ పరిస్థితులు తెలియజేస్తూ స్క్రీన్‌పై ఆయన సాహసాన్ని గమనిస్తున్నానని తెలిపారు. యుద్ధ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రభుత్వం ఇచ్చే యుద్ధ సేవా పతకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మింటీ అందుకుంది. ఈ పురస్కారం అందుకున్న తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా మింటీ మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 27న బాలాకోట్‌ స్థావరాలపై భారత్‌ యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్‌ నుంచి గట్టి ప్రతిస్పందన ఎదురవుతుందని భావించి అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఊహించినట్టే మనల్ని దెబ్బకొట్టేందుకు పాకిస్థాన్‌ ఎఫ్‌-16 మన గగనతలంలోకి ప్రవేశించింది. అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం అప్రమత్తంగా ఉండడంతో వారి వ్యూహం ఫలించలేదు. అదే సమయంలో అభినందన్‌ వర్థమాన్‌ ఎఫ్‌-16ని గురిపెట్టి కూల్చివేశాడు’ అని మింటీ తెలిపారు.

ఈ సందర్భంగా మన మిగ్‌ కూడా కూలిపోవడం, పారాచ్యూట్‌ సాయంతో పాకిస్థాన్‌ భూభాగంలో దిగిన అభినందన్‌ను స్థానికులు పట్టుకుని పాకిస్థాన్‌ సైనికులకు అప్పగించడం తెలిసిందే. దౌత్యపరమైన ఒత్తిడితో దాయాది దేశం మూడు రోజుల తర్వాత అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది.  

abhinandan vardhaman
minti agarwal
Pakistan
f-16 fiter jet
  • Loading...

More Telugu News