Arun Jaitly: అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమం... ఎయిమ్స్ కు బయలుదేరిన రాష్ట్రపతి!

  • 9న ఎయిమ్స్ లో చేరిన జైట్లీ
  • నాటి నుంచి ఐసీయూలోనే చికిత్స
  • నేడు పరామర్శించనున్న కోవింద్

మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. గత వారంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయనను పరామర్శించడానికి మరికాసేపట్లో ఎయిమ్స్ కు చేరుకోనున్నారు. కాగా, 66 ఏళ్ల అరుణ్ జైట్లీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. అనారోగ్యం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

Arun Jaitly
Ram Nath Kovind
AIIMS
  • Loading...

More Telugu News