Narendra Modi: దేశసేవకు కొత్త భాష్యం చెప్పిన ప్రధాని మోదీ
- కుటుంబ నియంత్రణ కూడా దేశసేవ కిందికే వస్తుందన్న ప్రధాని
- చిన్న కుటుంబాన్ని కలిగివుండడం కూడా దేశసేవేనంటూ వ్యాఖ్యలు
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సందేశం వినిపించిన ప్రధాని
దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ తన సందేశం వినిపించారు. ఈ సందర్భంగా దేశసేవకు సరికొత్త భాష్యం చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించడం కూడా దేశభక్తి కిందికే వస్తుందని అన్నారు. చిన్న కుటుంబాన్ని కలిగివుండడం ఓ విధంగా దేశసేవ చేయడమేనని అభిప్రాయపడ్డారు. అధిక జనాభాతో దేశంపై భారం పడుతుందని మోదీ పేర్కొన్నారు. మన బిడ్డల ఆకాంక్షలను ఎంతవరకు నిజం చేయగలిగాం? అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరూ సమాధానాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు.