Andhra Pradesh: సీఎం జగన్ ను ఎవరు విమర్శించినా తాట తీస్తా!: నటుడు రాజేంద్రప్రసాద్ కు పృథ్వీ వార్నింగ్

  • జగన్ కు శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే సూచించా
  • నేనేం తప్పు మాట్లాడలేదు
  • రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ ను టాలీవుడ్ పెద్దలు కలిసి శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే తాను సూచించానని ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్, వైసీపీ నేత పృథ్వీ తెలిపారు. అంతేతప్ప తాను ఎవరి గురించీ తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. చిత్తూరులోని చంద్రగిరిలో వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పృథ్వీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేసే ఈ పెద్దలు జగన్ సీఎం అవగానే విమర్శలు చేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్, రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమావాళ్లు ఆయన నుంచి లబ్ధి పొందారని పృథ్వీ గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుందనీ, లోకేశ్ పుట్టడని ఎద్దేవా చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
Rajendraprasad
prudhvi
warning
actor
  • Loading...

More Telugu News