Tirumala: తిరుమల లడ్డూలో సూది... వైవీ సుబ్బారెడ్డి సీరియస్!

  • దేవగుడిపల్లి నుంచి తిరుమలకు వచ్చిన శశాంక్
  • లడ్డూలో సూది రావడంతో అవాక్కు
  • నివేదిక ఇవ్వాలని ధర్మారెడ్డిని ఆదేశించిన వైవీ

కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావించే శ్రీవెంకటేశ్వరుని లడ్డూలో పోటు ఉద్యోగుల నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. లడ్డూలో సూది రావడంతో తీవ్ర కలకలం రేగింది. దేవగుడిపల్లికి చెందిన శశాంక్ రెడ్డి అనే భక్తుడు తిరుమలకు వచ్చి, స్వామి దర్శనానంతరం లడ్డూ ప్రసాదం తీసుకోగా, అందులో ఓ సూది కనిపించింది. దీంతో అవాక్కయిన ఆయన, టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తెలియడంతో, ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లడ్డూలో సూది రావడమేంటని అధికారులను ప్రశ్నించిన ఆయన, మొత్తం ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తు అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డిని ఆదేశించారు.

Tirumala
Tirupati
Ladoo
YV Subba Reddy
  • Loading...

More Telugu News