Janasena party: ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైంది: ‘జనసేన’ అధినేత పవన్

  • మూడేళ్ల ముందు నుంచే మేము పోరాడితే ఎన్నికల్లో గెలిచేవాళ్లం
  • రాపాకపై పలు కేసులు బనాయించారు
  • మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కునే కుట్ర తగదు

వైసీపీపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు లోక్ సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైందని, అందుకే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మూడేళ్ల ముందు నుంచే తాము పోరాటం చేసి ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాపాకపై పలు కేసులు బనాయించారని విమర్శించారు. జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఒక్క ఎమ్మెల్యేను లాక్కునేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి తమపై కక్ష ఎందుకు అని ప్రశ్నించారు.

Janasena party
Pawan Kalyan
YSRCP
jagan
cm
  • Loading...

More Telugu News