Chandrababu: చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • చంద్రబాబుకు రాఖీ కట్టిన సీతక్క
  • టీడీపీలో చేరినప్పటి నుంచి చంద్రబాబుకు రాఖీ కడుతున్న సీతక్క
  • ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు

టీడీపీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినా తమ రాజకీయ గురువుపై ఆమెకు అభిమానం తగ్గలేదు. ఆమే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు వద్దకు వెళ్లిన ఆమె... ఆయనకు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా మీపై అభిమానం చెక్కుచెదరదని ఆమె చాటుకున్నారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ప్రతి ఏడాది చంద్రబాబుకు రాఖీ కట్టడం ఆమెకు అలవాటు.

మరోవైపు, సీతక్కతో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. వీరిద్దరూ చంద్రబాబుకు రాఖీ కడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుడిచేతి నరంపై ఒత్తిడి పెరగడంతో నొప్పితో చంద్రబాబు బాధపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో, ఆయన విశ్రాంతి కోసం హైదరాబాదుకు వచ్చారు.

Chandrababu
Seethakka
Paritala Sunitha
Rakhi
Congress
Telugudesam
  • Loading...

More Telugu News