Telangana: పాడి రైతుల బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడిస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

  • ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని కలిసిన వెంకటరెడ్డి
  • కాల్వ పనుల బిల్లులు, గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి
  • మదర్ డెయిరీ రైతులకే రూ.25 కోట్లు చెల్లించాలన్న కోమటిరెడ్డి

తెలంగాణలో పాడి రైతుల బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వ పనుల బిల్లులు, మరమ్మతు పనులు చేస్తున్న గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణకు రూ.50 కోట్లు, గుత్తేదారులకు రూ.45 కోట్లు, పాడి రైతుల ప్రోత్సాహకానికి సంబంధించి రూ.100 కోట్ల బకాయిలు చెల్లించాలని, మదర్ డెయిరీ రైతులకే రూ.25 కోట్లు చెల్లించాలని కోరారు.  

Telangana
Mp
Komati Reddy
Venkat Reddy
  • Loading...

More Telugu News