Andhra Pradesh: ప్రైవేటు విద్యా వ్యవస్థకు మా ప్రభుత్వం వ్యతిరేకం!: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తాం
  • మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం
  • తూర్పుగోదావరిలో మంత్రి పర్యటన

ప్రైవేటు విద్యా వ్యవస్థకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేసేందుకు, మౌలిక వసతులను కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు.

రాజమహేంద్రవరం(రాజమండ్రి)లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన అనంతరం మంత్రి సురేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
YSRCP
ADIMULAPU SURESH
Education minister
we are against private education system
East Godavari District
  • Loading...

More Telugu News