Rahul Gandhi: గవర్నర్ జీ, ఎలాంటి కండిషన్లు పెట్టను.. ఎప్పుడు రమ్మంటారు?: రాహుల్ గాంధీ

  • జమ్మూకశ్మీర్ గవర్నర్ కు రాహుల్ ఘాటు సమాధానం
  • నా ట్వీట్ కు మీరిచ్చిన బలహీనమైన సమాధానాన్ని చూశా
  • జమ్మూకశ్మీర్ కు మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నా

జమ్మూకశ్మీర్ పర్యటనకు రాకముందే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు షరతులను పెడుతున్నారంటూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విమర్శించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారని... ప్రజల్లో అస్థిరతను సృష్టించాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ స్పందించారు.

'డియర్ మాలిక్ జీ... నా ట్వీట్ కు మీరిచ్చిన బలహీనమైన సమాధానాన్ని చూశాను. జమ్మూకశ్మీర్ కు మీ ఆహ్వానాన్ని అంగికరిస్తున్నా. ఎలాంటి షరతులు లేకుండానే వస్తా. జమ్మూకశ్మీర్ ప్రజలను కలుస్తా. నన్ను ఎప్పుడు రమ్మంటారు?' అంటూ ట్వీట్ చేశారు.

Rahul Gandhi
Satya Pal Malik
Jammu And Kashmir
Congress
  • Loading...

More Telugu News