Guntur District: ఏపీ మహిళా ఎమ్మెల్యేలపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడి అరెస్ట్

  • అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసభ్యకర పోస్టులు
  • తప్పించుకు తిరుగుతున్న నిందితుడు
  • గుంటూరు వచ్చిన నిందితుడికి అరదండాలు

ఏపీ మహిళా శాసనసభ్యుల ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి అసభ్యకర కామెంట్లు రాసిన వ్యక్తిని మంగళవారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురానికి చెందిన పునుగుపాటి రమేశ్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు పెట్టాడు.

గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన నిందితుడు రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం ప్రకాశం జిల్లా మొత్తాన్ని పోలీసులు గాలించారు. ఆ తర్వాత నెల్లూరు, కోయంబత్తూరు, సేలం, చెన్నై, బెంగళూరులోనూ వెతికినా నిరాశే ఎదురైంది.

తాజాగా, రమేశ్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు న్యాయవాదితో మాట్లాడేందుకు గుంటూరు వస్తున్నాడని పోలీసులు తెలుసుకుని రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. రైలులోంచి దిగగానే అతనిని అరెస్ట్ చేశారు.

Guntur District
Andhra Pradesh
MLAs
Facebook
arrest
  • Loading...

More Telugu News