Andhra Pradesh: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియామకం

  • ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్న యార్లగడ్డ
  • ప్రస్తుతం కేంద్రీయ హిందీ సంస్థలో యార్లగడ్డ సభ్యుడు

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రెండేళ్ల పాటు ఆయన కొనసాగనున్నారు. అధికార భాషా సంఘం ఏర్పాటు, దానికి నలుగురు సభ్యులను కూడా నియమించే వెసులుబాటు కల్పిస్తూ జీవో ఎంఎస్ నెం.10 ను విడుదల చేశారు. కాగా, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను గతంలో అందుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కేంద్రీయ హిందీ సంస్థలో యార్లగడ్డ సభ్యుడిగా ఉన్నారు.

Andhra Pradesh
Adikara Bhasa sangham
Yarlagadda
  • Loading...

More Telugu News