East Godavari: ‘జనసేన’ ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ లో కొత్త ట్విస్ట్!

  • రాపాకను మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు 
  • కస్టడీ విధించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరణ
  • ఎమ్మెల్యేను అరెస్టు చేసే విధానం ఇది కాదని సూచన

తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన విషయం తెలిసిందే. రాపాకకు కస్టడీ విధించే నిమిత్తం రాజోలు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు ఆయన్ని పోలీసులు హాజరుపరిచారు. అయితే, రాపాకకు కస్టడీ విధించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఓ ఎమ్మెల్యేను అరెస్టు చేసే విధానం ఇది కాదని సూచించారు. ఇక్కడ చుక్కెదురు కావడంతో రాపాకను స్టేషన్ కు తీసుకొచ్చి, స్టేషన్ బెయిల్ ఇస్తామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం.

East Godavari
Rajolu
Janasena
Rapaka
Mla
  • Loading...

More Telugu News