jagapathi Babu: జగపతిబాబుకి హిట్ ఇచ్చామనే ఆనందం అప్పుడు కలిగింది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'సింహస్వప్నం'తో జగపతిబాబు పరిచయం
  •  'ఆశయం'తోను దక్కని విజయం
  •  'పెద్దరికం' విజయం సంతోషాన్ని కలిగించింది

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో జగపతిబాబును గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "వీబీ రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబుని 'సింహ స్వప్నం' సినిమాతో తెలుగు తెరకి పరిచయం చేశారు. ఒక నిర్మాత తనయుడైన జగపతిబాబు, ఒక స్టార్ మాస్ హీరో వారసుడి ఇమేజ్ వున్నవారు చేయవలసిన సినిమాను చేశాడు. అందువలన ఆడియన్స్ ఆదరించలేదు.

ఆ తరువాత మేము జగపతిబాబు చేసిన 'ఆశయం' సినిమాకి పని చేశాము. ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో, మా కాంబినేషన్లో కూడా ఇతనికి విజయం ఇవ్వలేకపోయామేనని అనుకున్నాము. కానీ ఆ తరువాత జగపతిబాబు కోసం మేము రాసిన 'పెద్దరికం' బాగా ఆడేసింది. ఈ సినిమాలో జగపతిబాబు చాలా బాగా నటించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాతో జగపతిబాబుకి హిట్ ఇవ్వగలిగినందుకు మాకు చాలా సంతోషం కలిగింది" అని చెప్పుకొచ్చారు. 

jagapathi Babu
Paruchuri
  • Loading...

More Telugu News