Sri Ram: మేము కూడా శ్రీరాముడి వంశస్థులమే!: మేవార్-ఉదయ్ పూర్ రాచకుటుంబం

  • రాముడి కుమారుడు కుశుడి వారసులమని చెప్పిన బీజేపీ ఎంపీ దియాకుమారి
  • తాము రాముడి వారసులమని ప్రకటించిన మేవార్ రాచకుటుంబ సభ్యుడు మహేంద్రసింగ్
  • సుప్రీంకోర్టు కోరితే అన్ని ఆధారాలను సమర్పిస్తామన్న మహేంద్రసింగ్

తాము కూడా శ్రీరాముడి వంశస్థులమేనని మేవార్-ఉదయ్ పూర్ రాచకుటుంబ సభ్యుడు మహేంద్రసింగ్ తెలిపారు. రాముడి వంశస్థులెవరైనా ఉన్నారా? అని సుప్రీంకోర్టు అడిగిన విషయాన్ని తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు కోరితే అన్ని ఆధారాలను, డాక్యుమెంట్లను అందిస్తామని తెలిపారు.

తాము శ్రీరాముడి కుమారుడు కుశుడి వారసులమని బీజేపీ ఎంపీ, జైపూర్ రాజకుటుంబీకురాలు దియా కుమారి ప్రకటించిన మరుసటి రోజే మహేంద్రసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాముడి వారసులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారని దియా కుమారి తెలిపారు. శ్రీరాముడి వారసులు కావడం తమకు ఎంతో గర్వకారణమని చెప్పారు.

Sri Ram
Descendants
Mewar Udaipur Royal Family
Mahendra Singh
  • Loading...

More Telugu News