Modi: మరొకసారి మహాభారతం చదువు: రజనీకాంత్ పై కాంగ్రెస్ ఫైర్

  • ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి
  • ముస్లింలు ఎక్కువగా ఉన్నారనే జమ్ము,కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు
  • కోట్లాది మంది హక్కులను కాలరాసినవారు కృష్ణార్జునులు ఎలా అవుతారు?

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను సూపర్ స్టార్ రజనీకాంత్... కృష్ణార్జునులతో పోల్చిన సంగతి తెలిసిందే. రజనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రజనీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాను ఊహించలేదని, ఆయన వ్యాఖ్యలతో ఆశ్చర్యానికి గురయ్యానని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు కూడా జమ్ముకశ్మీర్ మాదిరే ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవిస్తున్నాయని... ఈ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం ఎందుకు తొలగించలేదో తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంగానే జమ్ము,కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశారని విమర్శించారు.

ఒక రాష్ట్రానికి ఒక న్యాయం... ఇతర రాష్ట్రాలకు మరో న్యాయం అనే అమిత్ షా వైఖరిని రజనీ సమర్థిస్తున్నారా? అని కేఎస్ అళగిరి ప్రశ్నించారు. కోట్లాది మంది హక్కులను కాలరాసిన మోదీ, అమిత్ షాలు... కృష్ణార్జునులు ఎలా అవుతారని మండిపడ్డారు. 'డియర్ రజనీకాంత్, మహాభారతాన్ని మరోసారి చదవండి. అందులో ఉన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి' అని సూచించారు.

Modi
Amit Shah
Rajinikanth
KS Alagiri
Krishna and Arjun
  • Loading...

More Telugu News